రెంజల్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెంజల్, సాటాపూర్, తాడ్ బిలోలి, నీలా, దూపల్లి, బాగేపల్లి, కునేపల్లి గ్రామాల్లో సర్పంచ్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రాజ్యాంగం రచించి 73 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగం గొప్ప తనాన్ని వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు గురించి వివరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్లు రమేష్ కుమార్, వికార్ పాషా, సునీత నర్సయ్య, లలిత రాఘవేందర్, సాయరెడ్డి, సాయిలు, విజయ లింగం, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, పంచాయతీ కార్యదర్శి స్వప్న, నాయకులు పార్వతి రాజేశ్వర్, మస్కుర్ ప్రవీణ్, మల్లసాయిలు, అనంత్ రావ్, గొసుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.