కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే ఈ భూమి మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ, ప్రజలను మనుషులుగా గుర్తించారని, భారతదేశంపై సర్వహక్కులు భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించారని అన్నారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం చదివి ప్రజల యొక్క హక్కులను తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి విజయలక్ష్మి భారత రాజ్యాంగం ప్రవేశికను విద్యార్థులకు చదివి రాజ్యాంగం గురించి విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అనురాధ, రేఖ, విద్యా వాలంటారీలు రజిత, భాగ్య, అశ్విని, అమల, మాధురి, అంగన్వాడి టీచర్ స్వరూప, గ్రామపంచాయతీ కారోబార్ సోపన్, తల్లిదండ్రులు అంకం సుధాకర్, వీఆర్‌ఏ సిద్ధ రాములు, పాఠశాల సిబ్బంది సంజువ్, శ్యామల, లక్ష్మి, హనుమవ్వ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.