నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ లా డే సందర్భంగా న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాదు కేశవ నిలయంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌ను ఇందూరు న్యాయవాదులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్, రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు వసంతరావు, బిట్ల రవి, సుజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.