కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

బోధన్‌, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. హైదరాబాదుకు చెందిన హెచ్‌వైఎం అనే సంస్థ ఇటీవల కళాశాల నిర్వహణను వివిధ అంశాలలో పరిశీలన చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా కళాశాల పాలన, నిర్వహణ పద్ధతులు, కళాశాలలో విద్యార్థుల హాజరు, కళాశాల ఆవరణలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు, ప్రయోగశాలల నిర్వహణ , గ్రంధాలయ నిర్వహణ, కళాశాలలో పరీక్ష ల నిర్వహణ ఉత్తీర్ణత శాతం, అధ్యాపకుల పనితీరు తదితర అంశాలలో శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశారు.

ఈ అంశాలలో అత్యున్నత ప్రమాణాలు సాధించడానికి కృషి చేస్తున్న కళాశాల ప్రిన్సిపల్‌, జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌కు సంస్థ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రఘురాజ్‌ ఆదివారం మాట్లాడుతూ కోటగిరి కళాశాలలో వివిధ అంశాలలో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటూ కళాశాలలో విద్యాబోధన, నిర్వహణ, శిల్ప పద్ధతులు అంశాలలో కళాశాలలో మంచి ర్యాంకును సాధించిందని తెలిపారు. హెచ్‌వైఎం సంస్థ 9001-2015 గుర్తింపు పత్రాన్ని సంస్థ ప్రతినిధి శివయ్య రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేసారు.

జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అత్యధిక శాతం విద్యార్థిని విద్యార్థులు పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారు విద్యనభసిస్తున్నారని వీరీ విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది క్రమశిక్షణ పద్ధతిలో పనిచేస్తూ కళాశాలకు మంచి పేరును సంపాదించడానికి కృషి జరుగుతుందని అన్నారు.

కళాశాలలో జనరల్‌ ఎంపీసీ, బైపిసి, సి.ఈ.సి, హెచ్‌.ఇ.సి. లో తెలుగు మీడియం, ఇంగ్లీష్‌ మీడియంతో పాటు వృత్తి విద్యా కోర్సులు కంప్యూటర్‌ సైన్స్‌, అకౌంట్స్‌ అండ్‌ టాక్సేషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఉర్దూ మీడియం జనరల్‌ గ్రూప్‌ తరగతులు కూడా కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాశాల అత్యున్నత స్థాయి ప్రమాణాలను హైదరాబాదుకు సంబంధించిన హెచ్‌వైఎం సంస్థ గుర్తించి ప్రశంసా పత్రాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం తనకు గర్వకారణంగా ఉందని తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »