కామారెడ్డి, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా పోలీస్ కేంద్రాన్ని పరిశీలించారు. బూతు స్థాయి అధికారి అందించే సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు, మహిళలు, పురుషుల వివరాలు అరా తీశారు. దివ్యాంగులను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటర్ జాబితాలో వారి పేర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.