రెంజల్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుదారులని, ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాల్సిందిగా బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు.ఆదివారం రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలోని ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ అనుసంధానం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరూ చేసుకోవలసిందిగా సూచించారు. ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోనట్లయితే ఓటు వేసే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శశిభూషన్, పంచాయతీ కార్యదర్శి స్వప్న, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు నర్సయ్య, మౌలానా, మధు తదితరులు ఉన్నారు.