ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్‌లోని హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది.

‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. మూడ నాగభూషణం గుప్తకి, ‘‘బటువు’’ పుస్తకాన్ని నిజామాబాద్‌ మాజీ శాసన సభా సభ్యులు యెండల లక్ష్మీనారాయణకి, ‘‘భరిణ’’ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా సహకార అభివృద్ధి కార్పోరేషన్‌ చైర్‌ పర్సన్‌ ఆకుల లలితకి అంకితం చేశారు.

సభాధ్యక్షత వహించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసె రచనలు ప్రగతికి మార్గదర్శనం చేస్తాయని, సాహిత్యవిమర్శ సాహిత్యలోతులను సహృదయులకు అందిస్తుందనీ, డా.త్రివేణి రాసిన మూడు పుస్తకాలు ‘‘అరుగు’’ ఆదరణకు, ‘‘బటువు’’ బంధానికి, ‘‘భరిణ’’ ఆత్మీయతకు ప్రతీకలని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

విశిష్టాతిథిగా పాల్గొన్న నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ మాట్లాడుతూ స్త్రీ చైతన్యాన్ని చాటి చెప్పేవిధంగా డా.త్రివేణి రచనలు ఉన్నాయని, సాహిత్యసృజనతో సమాజ వికాసానికి రచయితలు గొప్పకృషిని చేస్తున్నారన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెవివి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ ప్రజల భాషలో రాసిన రచనలు పదికాలాలు నిలబడుతాయని, త్రివేణి, తెలంగాణ విశ్వవిద్యాలయ కీర్తిని పెంచేవిధంగా రచనలు చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు.

హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు, ఆత్మీయ అతిథి ఘనపురం దేవేందర్‌ మాట్లాడూతూ సాహిత్యసృజన అధ్యాపకత్వం కార్యకర్తగా మూడుకోణాలలో త్రివేణి కృషి అపారంగా చేస్తున్నారన్నారు. అంకితంగా గ్రహించిన ఆకులలలిత మాట్లాడుతూ స్త్రీలు ఇంకా అన్నిరంగాలలో రాణించాలని, త్రివేణి ఆదర్శమార్గదర్శి అని అన్నారు.

రచయిత్రి త్రివేణి స్పందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలన్నారు. ‘‘అరుగు ‘‘అనే పుస్తకాన్ని డా. కాసర్ల నరేశ్‌ రావు, ‘‘బటువు ‘‘అనే పుస్తకాన్ని శ్రీ గోశిక నరసింహ స్వామి, ‘‘భరిణ ‘‘అనే పుస్తకాన్ని డా. శారదా హన్మాండ్లు పుస్తకాలను పరిచయం చేశారు. అంకితోత్సవం తీసుకున్న మూఢనాగభూషణం గుప్త, ఆకుల లలితను డా.త్రివేణి కుటుంబసభ్యులు ఘనంగా సన్మానించారు. సభాకార్యక్రమంలో కవులు వి.పి. చందన్‌ రావు, పంచరెడ్డి లక్ష్మణ్‌, మేక రామస్వామి, సాయిబాబు, పొద్దుటూరి మాధవీలత, తొగర్ల సురేశ్‌, చింతల శ్రీనివాస్‌, దస్తగిరి, గంట్యాల ప్రసాద్‌, శంక, పద్మావతి, డా. సాయిలక్ష్మి, పురంశంకర్‌, గనిషెట్టి రాములు, నారావేంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »