ఆర్మూర్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహరాష్ణ నాందెడ్ జిల్లాకు చెందిన రైతులు సంతోష్ అండే బగవన్, రాంనాత్ షిండే ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో పసుపు పంటను పరిశీలించారు. వీరిని తెలంగాణ ఉద్యమ సమితి ఉభయ జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్ రాంరెడ్డి పలు పసుపు పంట చేలను చూపించారు. పంటలకు సంబంధించిన విషయాలు వివరించారు.
పసుపు ఎందుకు ఇలా అయింది అని వారు అడగగ ఈ సంవత్సరం అధిక వర్షాలు పడడంతో అరవై శాతం పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గత ఏడాదికంటే ఈ సంవత్సరం పసుపు ఇరవై అయిదు శాతం తగ్గించామని బుల్లెట్ రాంరెడ్డి వారికి వివరించారు. పసుపు పంట బాగాలేనందుకు ధరలైన బాగుంటే అయినా అంతో ఇంతో రైతులు బతికి బట్టకడతారని లేకపోతే రైతులు వేరే పంటలు సాగు చేసేందుకు ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మునుముందు రైతులు పసుపు పంట పుర్తిగా పెట్టకుండా పోయే పరిస్థితి నెలకొందని అయన వివరించారు. వీరి వెంట రైతులు గంగరాజుల శ్రీనివాస్, మంతెన నవిన్, గంగాధర్ తదితరులు ఉన్నారు.