ఆర్మూర్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెడ్డు ముత్తెన్న బాల్కొండ రాసి రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం కాంబోడియా దేశానికి వెళ్లి అక్కడ సరైన వీసా లేకపోవడం వలన అక్రమ వీసాగా ఉండి కూలి పనులు చేసుకుంటూ, అనారోగ్యం పాలై ఇంటికి రావాలంటే వీసా దొరకక ఇండియాకు వచ్చే పరిస్థితి లేక ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటాపాటి నరసింహం నాయుడును కలిసి మొర పెట్టుకున్నాడు.
కోటపాటి ఢల్లీి స్థాయిలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధర్ దృష్టికి తీసుకువచ్చి కాంబోడియా ప్రభుత్వంతో చర్చలు జరిపి ముత్తెన్నను విడిపించుకొని క్షేమంగా రప్పించారు.
కాగా మంగళవారం ముత్తన్న కుటుంబ సభ్యులతో కోటపాటిని కలిసి ధన్యవాదాలు తెలిపి కాంబోడియాకు వెళ్లడం వలస సంపాదించినవి ఏమీ లేకపోగా ఐదు లక్షలకు పైగా అప్పు చేయాల్సి వచ్చిందని, కాబట్టి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా అభ్యర్థించాడు. కోటపాటి మాట్లాడుతూ త్వరలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి సహాయం చేయాల్సిందిగా కోరుతానని హామీ ఇచ్చారు. ముత్తెన్న లాంటి అనేకమంది తెలిసో తెలియకనో గల్ఫ్‌బాట పట్టి నష్టపోతున్నారని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇతర పథకాల ద్వారా ఆదుకోవాల్సిందిగా కోరారు.