నందిపేట్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ గౌడ సంఘం భవన నిర్మాణానికి రూ. 50లక్షలు, మారంపల్లి పద్మశాలీ సంఘం భవనానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మంగళవారం వెల్లడిరచారు. నందిపేట్ మండలానికి చెందిన గౌడ సంఘం, పద్మశాలి సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్ళి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మినిస్టర్ క్వార్టర్స్‌లో గల ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ుుఖ్యంగా నందిపేట్ గౌడ సంఘం భవనానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారు కోరిన విధంగా 50 లక్షల రూపాయలు మంజూరు చేసి గౌడ సంఘం భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే మారంపల్లి పద్మశాలీ సంఘం సభ్యులు కూడా జీవన్ రెడ్డిని కలిసి తమ పద్మశాలీ సంఘం భవనానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని వినతి చేయగా స్పందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అట్టి నిధులను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాము కోరగానే నిధులు మంజూరు చేసిన జీవన్ రెడ్డికి నందిపేట్ గౌడ సంఘం ప్రతినిధులు, మారంపల్లి పద్మశాలీ సంఘం సభ్యులు కృత్ఞతలు తెలిపారు.
ఆర్మూర్‌కు చెందిన పలువురు మైనార్టీ పెద్దలు జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. గత ఐదు నెలలుగా పెండిరగ్‌లో ఉన్న ఇమామ్ మౌజమ్ వేతనాలు చెల్లించినందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.