కామారెడ్డి, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఆవరణలోని రాశివనాన్ని మంగళవారం కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ పరిశీలించారు. రాశి వనంలో మొక్కలను నాటారు. ఇంకుడు గుంతలను, ఊటచెరువును, ఫిష్ పాండ్ ను సందర్శించారు. వీటి వల్ల సమీపంలోని బోరుల్లో భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
ఫిష్ పాండులో వివిధ రకాల చేపలను పెంచుతున్నట్లు చెప్పారు. రాశి వనం సమీపంలో ఉన్న బోరు వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేయడం వల్ల వేసవి కాలంలో సైతం బోరులో నీరు వస్తుందని చెప్పారు. ఇంకుడు గుంత లేనప్పుడు ఈ బోరు వేసవి కాలంలో ఎండి పోయిందని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం కేంద్రాన్ని పరిశీలించారు. నాణ్యమైన తేనె ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్ డిఓ సాయన్న, జిల్లా భూగర్భ జలాల అధికారి సతీష్ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య, తెలుగు అధ్యాపకుడు శంకర్, అధికారులు పాల్గొన్నారు.