నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్ జోన్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని ఎంపిక చేయగా నలుగురిని స్టాండ్ బై గా ఎంపిక చేసినట్లు తెలంగాణా యూనివరసిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్. నేత ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపికలు సీనియర్ హాకీ క్రీడాకారుడు డాక్టర్ పి, స్వామికుమార్, హాకి జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో చేయబడ్డాయన్నారు. ఈ సందర్బంగా నేత క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సౌత్ జోన్ టోర్నమెంట్ కర్ణాటకలోని బెంగుళూరు సిటీ యూనివర్సిటీలో పురుషుల టోర్నమెంట్ డిసెంబర్ 11 నుంచి 14వరకు జరుగుతుందని, మహిళా టోర్నమెంట్ డిసెంబర్ 26 నుండి 30వరకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ చెన్నైలో జరుగుతయని తెలిపారు.
క్రీడాకారులు అద్భుతమైన ఆటను ప్రదర్శించి తెలంగాణా యూనివర్సిటీ పేరు నిలపెట్టాలని సూచించారు. జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో విజయం సాధించి తిరిగి రావాలని క్రీడాకారులకు హాకీ సంఘము తరుపున సదుపాయాలు కల్పిస్తామని క్రీడాకారులు ఎటువంటి ఇబ్బందులు వున్నా తెలపాలని క్రీడాకారులకు సూచించారు.
కోచ్ స్వామి కుమార్ మాట్లాడుతూ ట్రోపితో తిరిగి రావాలని క్రీడాకారులకు టోర్నమెంట్‌కు వెళ్లే వరకు కలెక్టర్ మైదానంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎంపిక పక్రియలో సీనియర్ హాకీ కోచ్ జిన్నా గంగాధర్, సెపక్ తక్రా జిల్లా కార్యదర్శి గదారి సంజీవరెడ్డి, గిరిరాజ్ కళాశాల ఫిసికల్ డైరెక్టర్ బాలమణి, శ్రీనివాస్, స్వప్న, హర్షిత, గోదావరి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.