ఆయన పేరు వింటేనే కాంగ్రెస్‌, బీజేపీలకు వణుకు

నందిపేట్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమ నేతగా స్వరాష్ట్రాన్ని సాధించి ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రిగా ర్రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అభివర్ణించారు. సకలజనం మెచ్చిన నేత కేసీఆర్‌ అని, రాజకీయంగా ఎదురు, బెదురేలేని లేని ఉక్కు నేత కేసీఆర్‌ అని, ఆయన పేరు వింటేనే కాంగ్రెస్‌, బీజేపీలకు వణుకు పుడుతుందని, ఆయన సంస్కారం ముందు ప్రత్యర్ధులు తలదించుకుంటారన్నారు.

ప్రజలంతా కేసీఆర్‌కి వెన్నుదన్నుగా ఉన్నారని, మళ్లీ మళ్లీ విజయం టీఆర్‌ఎస్‌దేనని, ఈసారి ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించి కేసీఆర్‌ చరిత్ర సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు. కేసీఆర్‌ కాకుండా ఏ పార్టీ వచ్చినా ఉచిత పథకాలకు ఉప్పు పాతర వేస్తారని, పేదవర్గాల నోట్లో మట్టి కొడతారని, ఎనిమిదేళ్ల తరువాత తెలంగాణ ద్రోహులు ఎంట్రీ ఇస్తున్నారని, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వరాష్ట్రమైన తరువాత దేశమే విస్తుపోయేలా తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నదని, ప్రతీ ఇంట్లో సంక్షేమ వెలుగులు ప్రసరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

నందిపేట్‌ మండల కేంద్రంలోని నాయకపోడు సంఘం సభ్యులు పెద్ద ఎత్తున బుధవారం ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోని బంజారహిల్స్‌ రోడ్‌ నెం 12 -మినిస్టర్‌ క్వార్టర్స్‌లో గల ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా నాయకపోడు సంఘం సభ్యులు మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అధ్బుతమైన ప్రగతి సాధించేలా గొప్పగా పాలిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వ ప్రగతిశీలక ఆలోచనా విధానం పట్ల తామంతా ఆకర్షితులమై ఆర్మూర్‌ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నాయకత్వంలో పని చేయాలని టీఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనిక పాలనతో ప్రతీ పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.

నేడు యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని, కేసీఆర్‌ వంటి ప్రగతి శీలక ముఖ్యమంత్రి దేశంలోనే లేరని అన్నారు. అధికారానికి మానవీయతను జోడిరచి ఆయన పాలన సాగిస్తున్నారు అని జీవన్‌ రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ది సాకారమవుతుందని ప్రజల విశ్వాసమన్నారు. కేసిఆర్‌ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.

ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సమకూర్చే రైతు బంధు, ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించే రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, దళిత వర్గాల బతుకుల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు, చేనేతబంధు, గిరిజన రిజర్వేషన్లు, పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేసే కళ్యాణ లక్ష్మి, కేసిఆర్‌ కిట్‌, చితికి పోయిన కుల వృత్తులకు ప్రాణంపోసే పథకాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు, ఇంటింటికీ నల్లాల ద్వారా మిషన్‌ భగీరథ మంచినీటి సరఫరా- ఇలా ఎన్నో వినూత్నమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ధి రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ ది అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నందిపేట్‌ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్‌, జడ్పీటీసీ సభ్యుడు ఎర్రం యమునా ముత్యం, ఉపసర్పంచ్‌ కొత్తూర్‌ భరత్‌, ఎంపీటీసి సభ్యుడు మురళి, కో-ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ ఉస్సేన్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు మన్నె సాగర్‌, గాజుల శంకర్‌, మన్నె శీను తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »