కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్లో గురువారం పిఆర్టియు, టిఎన్జిఎస్ ఉద్యోగులతో ప్లాట్ల, గృహాల విక్రయంపై అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మధ్యతరగతి ఉద్యోగులకు అందుబాటు ధరకే ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసుకునే వీలుందని చెప్పారు. …
Read More »Monthly Archives: November 2022
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
రెంజల్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని 17 గ్రామాలలో సామాజిక తనిఖీలు చేపట్టడం జరిగిందని డిఆర్డిఏ పిడి చందర్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదికను పిడి ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల కాలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 9 కోట్ల 30 లక్షల పనులు చేపట్టినట్లు పిడి వెల్లడిరచారు. సామాజిక తనిఖీ బృందం …
Read More »ప్రతి మూడునెలలకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ మూడు నెలలకు ఒకసారి …
Read More »ఈనెల 14 నుండి 18 వరకు ప్లాట్ల వేలం
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న ప్రజలు కలెక్టర్ కామారెడ్డి పేరిట రూ.10 వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లేఅవుట్ అప్రూవల్ ఉందని సూచించారు. …
Read More »నిజామాబాద్‌లో కారుచౌక ధరలకే అందుబాటులో ప్లాట్లు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా, నగర ప్రజలకు ప్రజలకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సొంత ఇంటి కలను ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ కొనుగోలు చేసి సాకారం చేసుకునే అరుదైన అవకాశాన్ని ప్రజల చెంతకు తెచ్చిందన్నారు. నిజామాబాద్ నగరానికి అతి చేరువలో మల్లారం వద్ద జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరంగా నెలకొల్పడిన ధాత్రి టౌన్ షిప్‌లో కారు …
Read More »సిక్కు సోదరులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిక్కు మతస్థుల ఆది గురువు అయిన గురునానక్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాజుల్ పేట్ లో గల గురుద్వారాలో మంగళవారం నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. గురుద్వారాను సందర్శించిన కలెక్టర్ ను సిక్కు మతపెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కలెక్టర్ వారితో కలిసి ప్రార్థనల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »ధాత్రి టౌన్ షిప్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్‌ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మౌలిక …
Read More »చదువుల తల్లికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే
లింగంపేట్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండలం భవానిపెట్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గర్నే రసజ్ఞ ఇటీవల వెల్లడిరచిన నీట్ ఫలితాల్లో ఎంబీబీస్ సాధించగా ఆ విద్యార్థికి మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్ క్యాంప్ కార్యాలయంలో రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకొని తలిదండ్రులకు మంచిపేరు తేవాలని, డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని …
Read More »వేలం పాటను అడ్డుకుంటాం
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయలని సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. నగర శివారులోని మల్లారం ప్రాంతంలో ధాత్రి టౌన్షిప్ పేర వ్యవసాయ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి వేలం వేయడాన్ని ఆపివేయాలని, లేనియెడల వేలంపాటను అడ్డుకుంటామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. మంగళవారం సిపిఐ బృందం …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగాపూర్‌లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా తహసీల్దార్ పాల్గొన్నారు. కామారెడ్డి సొసైటీ డైరెక్టర్ ఎల్ శంకర్రావు, కౌన్సిలర్లు శ్రీనివాస్, కృష్ణాజి రావు, స్వామి, కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లింగారావు, లింగాపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బండారి రామ్ రెడ్డి, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ …
Read More »