నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనిట్ల స్థాపన కోసం వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలకు, ఎఫ్‌పీఓలకు, కో-ఆపరేటివ్ సొసైటీలకు …
Read More »Monthly Archives: November 2022
నిస్వార్థ సేవకులు రక్తదాతలే
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొండల్ రెడ్డి (45) ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరం కావడంతో ధర్మారావు పేట్ గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డి వెంటనే స్పందించి మానవ దృక్పథంతో ముందుకు వచ్చి ప్లేట్‌లెట్స్ దానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల …
Read More »అయ్యప్ప ఆలయానికి వాటర్ ట్యాంక్ అందజేత
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయానికి శనివారం ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా అనిత పెళ్లి రోజు సందర్భంగా 20 వేల రూపాయల విలువైన స్టీలు వాటర్ ట్యాంక్‌ను అందజేశారు. వాటర్ ట్యాంకును అందజేసినందుకుగాను ఆలయ కమిటీ ప్రతినిధులు విశ్వనాథుల మహేష్ గుప్తా అనిత దంపతులను అభినందించారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా చేయాలని …
Read More »శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్
బీమ్‌గల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చరిత్ర, …
Read More »కోటగిరిలో రెండు పడకల గదుల ఇండ్ల సర్వే
బోధన్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో 180 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పనులను డిఈ నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదుల నిర్మాణ లబ్ధిదారుల ఇండ్లను స్థానిక సర్పంచ్‌తో పాటు సర్వే చేయడం జరిగింది. ఇండ్లు ఏ దశలో ఉన్నాయని డిఈ నాగేశ్వరరావు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు నిర్మాణమును బట్టి బిల్లులు …
Read More »వర్ని తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
వర్ని, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వర్ని తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిరచారు. 9,10 తరగతులకు సంబంధించిన 6 నెలల బకాయి బిల్లులు చెల్లించాలని, నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజన యూనియన్ గౌరవ ఆధ్యక్షులు …
Read More »మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్
బోధన్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోతంగల్ పాఠశాలలో స్థానిక సర్పంచ్ వర్ని శంకర్ మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి భోజనం వడ్డించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు అన్నం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ …
Read More »అక్కడికి వెళ్తే సిజీరియన్ కాన్పులకే అవకాశం ఎక్కువ
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలు కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే సిజీరియన్ జరిగేందుకే ఎక్కువ ఆస్కారం ఉంటోందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామం గర్భిణీలు, శిశువుల ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపడమే కాకుండా సమాజానికి అనేక రకాలుగా నష్టం చేకూరుస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 54 శాతం సిజీరియన్లు అవుతుండగా, ప్రైవేట్ …
Read More »మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్ మేనేజర్, ఎం.హెచ్.ఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు …
Read More »ఈనెల 14 నుండి 18 వరకు వేలంపాట
కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి ప్రజలు తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ ధరణి టౌన్షిప్ …
Read More »