ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో …
Read More »Monthly Archives: November 2022
పోస్టల్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారిణి వై.సురేఖ బుధవారం తెలిపారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సేవలను విస్తరిస్తోందని, బట్వాడి నుండి మొదలుకొని డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోందని, ప్రజల ప్రయోజనాల కోసం …
Read More »శివనామస్మరణతో మారుమోగిన ‘‘సిద్ధుల గుట్ట’’
ఆర్మూర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్తీక మాసం చివరి రోజైన మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట శివనామస్మరణతో మారుమోగింది. వేలాది మంది భక్తులు సిద్ధులగుట్టపైకి చేరుకొని మహాదేవుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ (సప్తాహారతి) వైభవోపేతంగా జరిగింది. సిద్ధులగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయించారు. జీవన్ రెడ్డి …
Read More »ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి సన్మానం
భీమ్‌గల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామనికి చెందిన ఫహిం స్థానికంగా హోటల్ నడుపుకుంటాడు. అతని కూతురు మాహేక్ ఇటీవల విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో 3076 ర్యాంక్‌తో ఎంబీబీఎస్ సీటు సాధించింది. మంగళవారం ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ బాచన్‌పల్లి గ్రామంలో విద్యార్థినిని కలుసుకొని అభినందించి సన్మానించారు. కోర్సును పూర్తిచేసి డాక్టర్‌గా పేద ప్రజలకు …
Read More »కదం తొక్కిన వుమెన్స్ కాలేజ్ విద్యార్థినిలు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర నడిబొడ్డున గల మహిళా కళాశాల భూములపై నేతల కన్ను పడిరది. కళాశాల భూములు ఆక్రమణకు గురికావడంతో విద్యార్థులు కళాశాల భూములను కాపాడాలని కదం తొక్కారు. కళాశాల విద్యార్థులు రోడ్డేక్కి బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మహిళా కళాశాల భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్‌ను కళాశాల ప్రిన్సిపల్ …
Read More »25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి
డిచ్‌పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 5 సంవత్సరాల అప్లైడ్ ఎకనామిక్స్ మరియు ఫర్మసూటికల్ కెమిస్ట్రీ కోర్సుల 7 వ మరియు 9 వ సెమిస్టర్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు డిసెంబర్ 2022 లో ఉంటాయని, విద్యార్థులు ఈనెల 25 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అపరాధ రుసుము …
Read More »దళితబంధు యూనిట్ల పరిశీలన
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు యూనిట్లను మంగళవారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. సదాశివనగర్ మండలం పద్మాజి వాడి చౌరస్తాలో ఉన్న పెద్ద బూరి చరణ్ తేజకు చెందిన టెంట్ హౌస్ పరిశీలించారు. పొందుతున్న ఆదాయం వివరాలను అరా తీశారు. బిక్నూర్ మండలం సిద్ది రామేశ్వర నగర్ లో పిండి వంటలు తయారు చేసే యూనిట్, …
Read More »18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు కోసం రేపు బుధవారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవల్ అధికారుల వద్ద అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ ఓటర్ల నమోదుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023, జనవరి ఒకటి నాటికి …
Read More »డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా సేవలు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డ్రోన్ ద్వారా ఔషధాలను సరఫరా చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికార్ట్, టీ.శా అనే స్టార్టప్ కంపెనీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుండగా, కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ ద్వారా ఔషధాలను అవసరమైన ప్రాంతాలకు చేరవేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జిల్లా పాలనాధికారి సమక్షంలో …
Read More »మోటివేషనల్ స్పీకర్‌ను సన్మానించిన విసి
డిచ్‌పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :మోటివేషనల్ స్పీకర్ భాగవతుల శివ శంకర్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య డి.రవీందర్ గుప్త మర్యాదపూర్వకంగా సన్మానించారు. భాగవతుల శివశంకర్ ఐఐటి నుండి పీ.జీ. చేశారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా వివిధ కార్పొరేట్ సంస్థలలో గత 40 సంవత్సరం లుగా పనిచేస్తున్నారు. అనేక దేశాలలో మైండ్ మేనేజ్మెంట్ విషయంపైన ఉపన్యసించారు.
Read More »