నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గురువారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి …
Read More »Daily Archives: December 1, 2022
ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని తెలంగాణలోనే మొట్టమొదటి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్, రీసర్చ్ సెంటర్‌లో ఉచిత హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ శిక్షణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఆర్ ప్రిన్సిపల్ నుజుమ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ 1 సంవత్సరం పూర్తి …
Read More »వెల్ నెస్ సెంటర్ వసతి కల్పించండి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరకొర వసతులతో, రిటైర్డ్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సేవ లందిస్తున్న ఇహెచ్‌జెఎస్ వెల్‌నెస్ సెంటర్ మనుగడ అగమ్య గోచరంగా, ప్రశ్నార్ధకరంగా మారిందని, కలెక్టరేట్ బిల్డింగ్ కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుతం నడుస్తున్న వెల్నెస్ సెంటరు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడిరదని, దీనిని తిరిగి ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మీమాంస నెలకొని వుందని …
Read More »వారం రోజుల్లోపు లక్ష్య సాధన పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంటసాగుపై సమీక్ష జరిపారు. …
Read More »ఇద్దరు పిల్లలను దత్తత ఇచ్చారు
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇద్దరు పిల్లల్ని దత్తత ఇవ్వడం జరిగింది. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శిశు గృహలో వసతి పొందుతున్న ఆరు నెలల వయసు గల ఇద్దరు అమ్మాయిలను బెంగళూరు, విజయవాడకు చెందిన తల్లిదండ్రులకు దత్తత ఇచ్చారు. పిల్లలు లేని వారు దత్తత తీసుకొనే అవకాశం ప్రభుత్వం …
Read More »ఆర్మూర్‌లో వాల్ ఆఫ్ కైండ్ నెస్ ప్రారంభం
ఆర్మూర్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయం అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఎదురుగా ఆదర్శ బుక్ స్టాల్ సమీపంలో మార్కెట్ యార్డ్ గోడకు ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్ నెస్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆదర్శ మిత్రుల ఆధ్వర్యంలో నల్లగొండ రాజేందర్ గౌడ్ …
Read More »అయ్యప్ప ఆలయంలో అన్నదానం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి పట్టణ అయ్యప్ప ఆలయం నందు నిత్య అన్నదానం సందర్భంగా అన్నదాన ట్రస్ట్ మెంబర్ శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు యాద నాగేశ్వరరావు, ఎర్రం శ్రీధర్ అన్న ప్రసాదం ఆలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి బొందుగల లక్ష్మీకాంతం స్వామి, సహాయ కార్యదర్శిలు గోనె శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, అన్నప్రసాద సేవాసమితి ఉపాధ్యక్షులు …
Read More »ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను ఏ.ఆర్టి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ …
Read More »ఆధార్ నవీకరణ చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కల్లెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 5-15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ కేంద్రంలో ఎలాంటి చార్జీలు ఉండవని సూచించారు. జిల్లాలోని మీసేవ, ఆధార్ కేంద్రాలను …
Read More »