కామారెడ్డి, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను ఏ.ఆర్టి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రక్తదాతలంటే తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శమని ఆపదలో ఉన్నవారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్న రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ద్వారా అందజేయడం అభినందనీయమని ఇలాంటి పురస్కారాలు రక్తదాతలకు మరింత బాధ్యతను పెంచడమే కాకుండా సమాజంలో నిస్వార్ధంగా సేవలు చేస్తున్న వారికి ఎంతగానో ప్రోత్సాహాన్ని అందజేస్తాయన్నారు.
ఉత్తమ రక్తదాత పురస్కారాలను డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాష్, జమీల్, గంప ప్రసాద్, గోవర్ధన్, కిరణ్, రవి, సాయి, ఎస్.డి.ఖదీర్‌లకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్,ఏ. ఆర్టి మెడికల్ అధికారులు డాక్టర్ పావని, డాక్టర్ అమీనా, డాక్టర్ పద్మజ, జిల్లా అకౌంట్స్ సహాయ అధికారి మహేష్, ఏఆర్పి కౌన్సిలర్ నాగరాజు, నగేష్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.