ఆర్మూర్, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయం అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఎదురుగా ఆదర్శ బుక్ స్టాల్ సమీపంలో మార్కెట్ యార్డ్ గోడకు ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్ నెస్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.
ఆదర్శ మిత్రుల ఆధ్వర్యంలో నల్లగొండ రాజేందర్ గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్ నెస్ గురించి నిర్వాహకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వివరించారు. మన ఇళ్ళలో నిరుపయోగంగా ఉన్న దుస్తులు, బుక్స్, ఫుట్ వేర్, చిన్న పిల్లల బొమ్మలు, బుక్స్, బెడ్ షీట్స్ ఇక్కడ ఇచ్చి వెళ్తే వాటి అవసరం ఉన్న పేదలు ఉచితంగా తీసుకెళ్ళి ఉపయోగించుకుంటారని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ మిత్రులను అభినందించారు. పట్టణంలో ఉన్న నిరుపేదలు ఈ వాల్ ఆఫ్ కైండ్ నెస్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ పేదల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అతిక్, ఆదర్శ మిత్రులు సంగేశ్వర్, రాజేందర్ గౌడ్, సీహెచ్ పవన్, వెంకట గిరి, రణవీర్, విద్యా సాగర్, జగన్, పవన్, ప్రభు, మురళి, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పండిత్ పవన్, ప్రేమ్, సంజయ్ సింగ్ బబ్లూ, పూజ నరేందర్, అయ్యప్ప శ్రీనివాస్, కొంగి సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.