నిజామాబాద్, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరకొర వసతులతో, రిటైర్డ్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సేవ లందిస్తున్న ఇహెచ్‌జెఎస్ వెల్‌నెస్ సెంటర్ మనుగడ అగమ్య గోచరంగా, ప్రశ్నార్ధకరంగా మారిందని, కలెక్టరేట్ బిల్డింగ్ కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుతం నడుస్తున్న వెల్నెస్ సెంటరు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడిరదని, దీనిని తిరిగి ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మీమాంస నెలకొని వుందని తెలంగాణా ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కే .రామ మోహన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
లబ్ధిదారులకు కొద్దో గోప్పో వైద్య సహకారాన్ని అందిస్తున్న వెల్నెస్ సెంటర్‌ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించేందుకు లబ్ది దారులకు ఉపయోగపడేలా సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
దీనిపై చర్చించేందుకు 4తేది ఆదివారం ఉదయం 11 గంటలకు నామ్‌దేవ్‌వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని సంఘాల నాయకులు హాజరై వెల్‌నెస్ సెంటర్‌ను పటిష్టపరిచేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి, జార్జి, కోశాధికారి ఈ. వి. యల్. నారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. ప్రసాదరావు పాల్గొన్నారు.