నవీపేట్, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నెపల్లె గ్రామంలో సుమారుగా 90 మంది రోగులకు బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఏఎన్ఎం అనురాధ తెలిపారు. ఉదయం సుమారుగా 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అవసరమైన మందులు ఉచితంగా పంపిణి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సేవలని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబితా, ఎంపీటీసీ సభ్యులు బట్టు రాణి, వార్డ్ మెంబర్లు, ఆశావర్కర్లు మీనా, కవిత, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.