రెంజల్, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆయిల్ ఫామ్ సాగు పంటలపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునానని జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్ దాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బోధన్ డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణదికారులకు ఆయిల్ ఫామ్ సాగు పంటలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్ దాస్ మాట్లాడారు.
రైతులకు లాభదాయకంగా ఉన్న ఆయిల్ ఫామ్ సాగు పంటలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి సాగు ఆవశ్యకత ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ గురించి వ్యవసాయాధికారులు, విస్తీర్ణదికారులు గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల సాగు గురించి అవగాహన కల్పించి ఆయిల్ ఫామ్ పంటల వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాల గురించి తెలియజేయాలన్నారు.
కార్యక్రమంలో ఏడిఏ వాజిద్ హుస్సేన్, సంతోష్, సర్పంచ్ రమేష్ కుమార్, జడ్పీటీసీ విజయసంతోష్, మండల రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, జిల్లా డైరెక్టర్ మౌలానా, వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ మైనార్టీ జిల్లా నాయకుడు రఫిక్, వివిధ మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణదికారులు తదితరులు పాల్గొన్నారు.