ఆర్మూర్, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టూరిజంలో ఆర్మూర్ పట్టణానికి ల్యాండ్ మార్క్ అవుతుందని భావిస్తున్న గుండ్ల చెరువును ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గుండ్లచెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను పరిశీలించారు. బోట్లో ప్రయాణం చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
365 రోజులు నీటితో కళకళ లాడే గుండ్లచెరువు మధ్యలో ఐలాండ్ నిర్మాణం, బోటింగ్‌కు వచ్చే పర్యాటకులకు మంచినీటి వసతి, బ్రేక్ ఫాస్ట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఒక వసతి గృహం నిర్మించాలని జీవన్ రెడ్డి అధికారులకు సూచించారు.