నందిపేట్, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ పట్టణంలోని వడ్డెర సంఘం సభ్యులు జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా వడ్డెర సంఘం సభ్యులు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పాలన పట్ల తామంతా ఆకర్షితులం కావడమే కాక ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యే ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు.