కామారెడ్డి, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వసతి గృహాల్లో చేపడుతున్న మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఎస్సీ వసతి గృహాల్లో కొనసాగుతున్న మరమత్తు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడారు.
పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కోరారు. ఎస్సీ వసతి గృహాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి ఉన్న నిధులకు అనుగుణంగా పనులను పూర్తి చేయించుకోవాలని పేర్కొన్నారు. వసతి గృహాల సంక్షేమ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అన్ని వసతి గృహాలలో మౌలిక వసతులను కల్పించాలని చెప్పారు.
పనులు జరగకమందు ఉన్న సమస్యను, పనులు పూర్తయిన తర్వాత సమస్య పరిష్కారమైన ఫోటోలను తీయించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ వసతి గృహాల సంక్షేమ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.