నందిపేట్, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవమును శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ వికలాంగులు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరారు. వికలాంగుల పిల్లలఫై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు.
మండల అభివృద్ధి అధికారి నాగవర్ధన్ మాట్లాడుతు దివ్యాంగులు ఎటువంటి నిరుత్సాహానికి గురికాకూడదని, మనోదైర్యంతో ఉండాలని, వారి పట్ల ఎటువంటి వివక్ష చూపరాదని తెలిపారు. మండల విద్యశాఖధికారి పి.శ్రీనివాస్ రెడ్డి ప్రసంగిస్తూ బడి ఈడు దివ్యాంగుల విద్యార్థులను వారి తల్లిదండ్రులు భవిత కేంద్రానికి పంపుతూ, కేంద్రం యొక్క సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
అంతకు ముందు భవిత కేంద్రంలోని వికలాంగ విద్యార్థులందరికీ మ్యూజికల్ చైర్, రన్నింగ్, త్రో బాల్ మెదలగు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులందరికీ బహుమతి ప్రదానం, విద్యార్థులందరికీ బస్‌పాస్‌లను పంపిణీ చేసారు.
కార్యక్రమంలో యం.పి.టి.సి శ్రీకాంత్, కొండూర్ సర్పంచ్ ప్రభాకర్, జిల్లా పి.ఆర్.టి.యు అధ్యక్షుడు పి.మోహన్ రెడ్డి, మండల పి.ఆర్.టి.యు అధ్యక్షుడు కిషన్, రిసోర్స్ పర్సన్స్ నాగేష్ గౌడ్, సంతోష్ కుమార్, వివిధ గ్రామాల దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.