కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి, గాంధారి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు వివరాలను బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రంలో ఉన్న దివ్యాంగుల వివరాలు అడిగారు. వారికి సదరం అనుసంధానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శీను, తాసిల్దార్ వెంకట్రావు, బూత్ లెవల్ అధికారులు రాజశేఖర్, శశిరేఖ, సరోజన పాల్గొన్నారు.