డిచ్‌పల్లి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ (ఎంసిఎన్) విభాగంలో మంతెన రవి కుమార్‌కు పీ హెచ్‌డి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆచార్య కె. శివశంకర్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ద వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ తెలుగు ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్ విత్ ఏన్ ఎంపసిస్ ఆన్ ద పోస్ట్ కోవిడ్-19 పండేమిక్’ ‘అనే అంశంపై రవి కుమార్ పరిశోధన గ్రంథం సమర్పించారు.
శనివారం తెయూ ఆర్ట్స్ కాలేజి మాస్ కమ్యూనికేషన్ విభాగం హాల్లో నిర్వహించిన వైవాకు హైదరాబాద్ ఇఫ్లు యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రాజారాం ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. పరిశోధకుడిని డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ తెయు బి.సుధాకర్ రెడ్డి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
కార్యక్రమంలో తెయూ, బిఓఎస్ డాక్టర్. శాంతాబాయి, అధ్యాపకులు, డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీ శ్రీనివాస్ గౌడ్, మోహన్, కాంట్రాక్ట్ అధ్యాపకుల అధ్యక్షుడు డాక్టర్ దత్త హరి, పరిశోధక విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.