ఆర్మూర్, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణకు చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 19 ఢల్లీిలో జరిగే చలో ఢల్లీి మాదిగల లొల్లిని జయప్రదం చేయాలని ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జ్ సల్లూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గుడారం మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నాల సంజీవయ్య, ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ బచ్చపల్లి దేవయ్య కోరారు.
బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్‌సి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి పట్టించుకోకపోవడం చాలా విచారకరమని వారన్నారు. డిసెంబర్ 6 నుండి జరిగే పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. చలో ఢల్లీి కరపత్రాలను కమల కాలనీ ఎస్సీ కమిటీ హాల్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కే రాములు, పోచన్న, పోశెట్టి, మల్లయ్య, స్వరూప, స్వప్న, సరోజ, చిలుక శంకర్ తదితరులు పాల్గొన్నారు.