కామారెడ్డి, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రాజంపేట మండల కేంద్రానికి చెందిన నవీన్ గౌడ్ (25) కు రక్తహీనతతో అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. వెంటనే స్పందించి విద్యాశాఖలో జిల్లా సెక్టోరియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ సహకారంతో ఏబి నెగిటివ్ రక్తాన్ని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేశారు.
అత్యవసరంగా రక్తం అవసరం అని తెలియజేయగానే రాత్రివేళ అయిన వెంటనే స్పందించి ముందుకు వచ్చిన రక్తదాత వేణుగోపాల్ శర్మకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే 9492874006 కి సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తం అంద జేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో టెక్నిషన్‌లు చందన్, యేసు గౌడ్ పాల్గొన్నారు.