కామారెడ్డి, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు ప్రపంచమే నిన్ను చూసేలా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలమని అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని అడిషనల్ ఎస్‌పి అనొన్య అన్నారు. సోమవారం అడ్లూర్ ఎల్లారెడ్డి ఆర్‌టీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్ కలాం విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ప్రతి ఒక్కరు నేడు అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపిజె అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931 జన్మించి 27 జూలై 2015 లో మరణించారన్నారు. ఆయన దేశంలో ఎన్నో అణుపరీక్షలు చేసి నేడు ప్రపంచానికే దేశ ప్రతిష్టను చాటి చెప్పాడన్నారు. కలలు కనండి వాటిని సాదించుకోండి అంటూ యువతకు మార్గదర్శకంగా నిలిచారన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం. ఏ సలీమ్, ఆర్‌టిఐ రాష్ట్ర అధ్యక్షులు రాజన్న, సర్పంచ్ జానకి జనార్దన్, ఉప సర్పంచ్ లక్ష్మిపతి, ఎంపిటిసి రేణుక, లక్ష్మి, పిఏసిఎస్ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్‌టిఐ జోనల్ ఆద్యక్షుడు ప్రదీప్ కుమార్, ఆర్‌టిఐ మండల ప్రధాన కార్యదర్శి నితిన్ గౌడ్, గ్రామ ప్రెసిడెంట్ లింగం, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, గ్రామ ఉపాఅధ్యక్షులు ఆంజనేయులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ సభ్యులు షకీల్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.