కామారెడ్డి, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట కి మండల కేంద్రానికి చెందిన నవీన్ గౌడ్ (27) కి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ రెడ్డి కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రక్తదానం చేశారన్నారు.
పదివేల మందిలో కేవలం 500 నుండి 1000 మందిలో మాత్రమే ఏబి నెగిటివ్ రక్తం ఉంటుందని తెలిపారు. నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలంటే ఎంతగానో ఆలోచించడం జరుగుతుందని అలాంటిది ఆపదలో ఉన్న వారి కోసం అడగగానే రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత రమేష్ రెడ్డికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలో ఎన్నో రకాలైన దానాలున్నప్పటికీ రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని, డబ్బుతో సంబంధం లేకుండా చేయగలిగే సేవా కార్యక్రమం రక్తదానమని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ మరియు తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ నిర్వాహకుడు డాక్టర్ బాలు, జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్, రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్, వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఏసుగౌడ్ పాల్గొన్నారు.