రెంజల్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దూపల్లి కూనేపల్లి గ్రామాలలో సోమవారం సర్పంచ్లు సాయరెడ్డి, విజయ లింగంలు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిధి ద్వారా ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత, సీఎం సహాయని ద్వారా చెక్కుల మంజూరుకు కృషి చేయడం జరిగిందన్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సహాయ సహకారాలు అందించడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, ఉపసర్పంచ్ కంచ సాయిలు, కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.