నిజామాబాద్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధార్ నమోదుతో పాటు నకిలీ ఆధార్ కార్డుల గుర్తింపు, ఇతర అక్రమాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ఆధార్ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయ్యిందని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులు, మీ సేవా నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఈ విషయాన్ని వెల్లడిరచారు.
ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఈ-సేవ జిల్లా మేనేజర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పోస్టల్, యూఐడీఏఐ, డీఈఓ, డీడబ్ల్యూఓ, డీఎంహెచ్‌ఓ తదితర శాఖల అధికారులు మెంబర్ కన్వీనర్లుగా ఉంటారని తెలిపారు. ఆధార్ నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా, అక్రమాలకు ఆస్కారం ఉండకుండా ఈ కమిటీ పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగిస్తుందని వివరించారు. సమావేశంలో డీఆర్డీఓ చందర్, యూఐడీఏఐ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఈ-డీఎం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.