రెంజల్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఒకే రకమైన పంటలు పండిరచకుండా పంట మార్పిళ్లపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునని వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేలలోని భూసారాన్ని తగ్గించకుండా ఆర్గానిక్ ఎరువులపై దృష్టి సారించాలన్నారు. భూమిసారాన్ని కోల్పోతే పంటలు దిగుబడి తగ్గి రైతులు నష్టాలని ఎదుర్కొంటారని రైతులు లాభాల బాటలో నడవాలంటే నేలలోని భూసారాన్ని పెంపొందించేందుకు ఆర్గానిక్ ఎరువులపైన దృష్టి సారించాలని అన్నారు.
రైతులు పంటలు కోసిన తరువాత పొలంలో ఉన్న గడ్డిని కాల్చకుండా గడ్డిని అలాగే ఉంచినట్లైతే భూమి సారవంతంగా మరి అధిక దిగుబడులు వస్తాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ కుమార్, బిఆర్‌ఎస్ మైనార్టీ జిల్లా నాయకులు రఫిక్, మండల వ్యవసాయ విస్తీర్ణదికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.