కామారెడ్డి, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేసుల పరిష్కారంలో అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వారిగా పెండిరగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పురోగతిపై సమీక్ష చేశారు. క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, అటవీ, మున్సిపాలిటీ తదితర శాఖల కేసుల వివరాలు అరా తీశారు. త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.