డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ

ఆర్మూర్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్‌ కార్యాలయంలో మున్సిపల్‌ అధికారులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా కొనసాగుతాయని తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా వారు సూచించారు దీని కొరకు కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌ ఫొటోస్‌ జత చేసి సంబంధిత అధికారులకు ఇవ్వవలసిందిగా కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు మనోహర్‌, నరసయ్య, చెన్న గంగా మోహన్‌, రాజశేఖర, సువర్ణ, పూర్ణమల్లి, పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »