నందిపేట్, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన ‘భారతరత్న అంబేద్కర్’ అని నందిపేట్ మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ పేర్కొన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నందిపేట్ మండల టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు.
డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు అని, అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేడ్కర్ అని, కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారన్నారు.
దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని, చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారన్నారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చరిత్రాత్మకమైనదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం పరిపాలనలో అత్యంత ఉన్నత స్థానమైన శాసనసభ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగిందని, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం దళిత బంధు ప్రకటించిందని, రాబోయే కాలంలో మరిన్ని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు రూపొందించడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో నందిపేట్ మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, టిఆర్‌ఎస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు పొగరిసంజీవ్, నందిపేట వార్డు మెంబర్లు గంధం సాయిలు, తల్వేద రాజేందర్, బోర్రోళ్ల చిన్నయ్య, ఎంపీటీసీ బజరంగ్, గోసంగి సంఘం మండల అధ్యక్షులు శేఖర్, ముదిరాజ్ సంఘం మండల యూత్ అధ్యక్షులు దర్వాడి అశోక్, టిఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు దినేష్, శివ, దీపక్, శ్రీకాంత్, గంగాధర్, లక్ష్మణ్, తిరుపతి, సాయికుమార్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.