రెంజల్, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆయిల్ పంపండలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో రైతులకు ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన కల్పించారు. నూనె గింజల పంటలకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహిస్తుందని, ఆయిల్ పంట సాగు వలన కలిగే లాభాలను, సాగు విధానాలను వివరించారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ మరియు మొక్కలను,డ్రిప్ పరికరాలను అందిస్తున్నట్లు వివరించారు. అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందవచ్చని అన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ వెల్మల సునీత నర్సయ్య, ఎంపీటీసీ లక్ష్మీ లింగారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు మౌలానా, వ్యవసాయ విస్తీర్ణదికారులు అజయ్, ప్రసాద్, గోపీకృష్ణ, భాగ్య శ్రీ, రచన, ఏపిఓ శరత్, రైతులు, సుధాకర్ రావు, సురేష్ పాటిల్, మస్కుర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.