రెంజల్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్నం భోజనంలో ముద్ధ వంకాయకూర వడ్డించారు.
సాయంత్రం సమయంలో విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి రావడంతో కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ బలరాం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరికొంతమంది విద్యార్థులు ఇంటికి చేరుకున్నాక వాంతులు, కడుపునొప్పి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నవీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు, రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 మంది విద్యార్థులు వైద్య పరీక్షలు నిర్వహించారు.