రెంజల్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వార్షిక తనిఖీలోనిగా భాగంగా బుధవారం రెంజల్ పోలీస్ స్టేషన్ ను బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రకాల రికార్డులతో సిబ్బంది పనితీరును పరిశీలించడం జరిగిందని అన్నారు.
పెండిరగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించడం జరిగిందని పోలీస్ స్టేషన్లలో ఉన్న పలు రికార్డులు పూర్తిగా ఉన్నాయని ఎస్ఐ సాయన్నతో పాటు రైటర్‌ను అభినందించారు. ఆయన వెంట రూరల్ సిఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై సాయన్న, నారాయణ సింగ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.