రెంజల్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్‌వో విద్య సందర్శించారు. మంగళవారం పాఠశాల చెందిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు బాలికల వసతిగృహంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలలో నిత్యవసర వస్తువులను తనిఖీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ తీరును పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థకు గురైన విద్యార్థుల పరిస్థితి మెరుగ్గా ఉందని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందని, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆమె వెంట ఇంచార్జి వైద్యాధికారి శివ ప్రసాద్, ఆరోగ్య విస్తీర్ణదికారులు శ్రావణ్ కుమార్, రవీందర్, పార్మాసిస్ట్ రాంచందర్, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు.