దేశ రక్షణంలో త్రివిధ దళాల సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, డిసెంబరు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశానుసారము ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డి.రమేష్‌ నిజామాబాద్‌ జిల్లా నూతన కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సాయుధ దళాల పతాక దినోత్సవమును జండా ఊపి ప్రారంభించినారు.

దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క భారత దేశ పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఫీుభావము తెలుపుట అత్యవసరమని నిజామాబాద్‌ జిల్లా కమీషనర్‌ అఫ్‌ పోలీస్‌ కె.ఆర్‌.నాగరాజు తన కార్యాలయములో బుధవారం సాయుధ దళాల పతాక దినోత్సవమునకు తనవంతు విరాళములను అందజేశారు.

నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌ నుండి కాశీనాథ్‌ కాబడే, ఆర్మూర్‌ నుండి బదాం శ్రీనివాస్‌, చిట్టాపూర్‌ బాల్కొండ నుండి ఏర్రం నర్సయ్య, వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామం నుండి ర్యాడ మహేష్‌ భారత దేశరక్షణలో ప్రాణాలు అర్పించి యున్నారని గుర్తుచేస్తూ వారి సేవలను కొనియాడినారు. ఈ సందర్బంగా మద్దపల్లి దయానందం వినాయక్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లా నివాసి స్వచ్ఛందంగా రూ. 30 వేలు విరాళమును ఆర్ధికముగా ఇబ్బందులలో వున్న మాజీ సైనిక వితంతువులు అయిన నీల, మంగ జయలక్ష్మి, కోమరోళ్ళ సుజాత ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెక్కులను అందించి తన దాతృతను చాటారు.

ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డి.రమేష్‌, మద్దపల్లి దయానందంని శాలువతో సత్కరించి అభినందిస్తు దయానందంని స్పూర్తిగా తీసుకొని నిజామాబాద్‌ జిల్లా నుండి వ్యాపారస్తులు, ప్రజలు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులకు, వారి కుటుంబాలకి స్వచ్ఛందముగా విరాళాలను అందించి ఆదుకోవాలని సూచించారు. దేశ భద్రతలో బాగంగా శత్రువుల దాడులలో అమరులై తమ ప్రాణాలను సైతం ఖాతరు చేయకుండా భారతదేశ ప్రజలకు రక్షణ కవచంలా ఉంటున్నారని కొనియాడారు.

అలాగే జిల్లా ప్రజలు కుడా స్వచ్చందముగా తమవంతు విరాళాలను సైనిక సంక్షేమమునకు అందిచాలని మరియు జిల్లా ప్రజల నుండి సేకరించిన విరాళాలను ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలకు అందచేయడం జరుగుతుందని తెలిపారు. దేశ రక్షణ కొరకు చేసిన త్యాగాల కన్న మించిన త్యాగం మరి ఏదిలేదని కొనియాడారు. ఈ సందర్బముగా నిజామాబాద్‌ జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమవంతు విరాళాలను అందజేసి వీరజవాన్ల కుటుంబాలకు, సైనికులకు, మాజీ సైనికులకు, మాజీ సైనిక వితంతువులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమములో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది యం.రమేష్‌ కుమార్‌, బదాం గంగామోహన్‌, లక్ష్మణ్‌, ఉమేర్‌, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుజరాతీ మోహన్‌, కార్యదర్శి యం.దివాకర్‌ రెడ్డి, అబ్రహం, సుజాత, సరస్వతి, జయశ్రీ, కామారెడ్డి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం సంఘం అధ్యక్షులు పాపిరెడ్డి, కార్యదర్శి కె.సంజీవ్‌, జగన్‌ రెడ్డి, యం.సాయిరెడ్డి, మాజీ సైనికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »