సిద్ధుల గుట్టపై సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం

ఆర్మూర్‌, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని సిద్ధులగుట్ట ఘాట్‌ రోడ్‌ పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను గురువారం పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రారంభించారు. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి విదితమే.

ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని సిద్ధులగుట్ట అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబుల్‌ లైన్‌తో ఘాట్‌ రోడ్డు నిర్మించారు. ఆలయానికి కొత్త రథం సమకూర్చారు. సిద్ధులగుట్టపై ప్రతి సోమవారం క్రమం తప్పకుండా మూడు వేల మందికి జీవనన్న ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా భోజన వసతి కలిపించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా రూ. 50 లక్షల వ్యయంతో బాత్‌రూములు నిర్మించారు. వీటిని కూడా జీవన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు.

సిద్ధులగుట్టపై పూర్తి స్థాయిలో సౌకర్యాలు కలిపించి ఎంతో ఘనంగా అభివృద్ధి చేసిన జీవన్‌ రెడ్డి భక్తులకు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిద్ధులగుట్టపై నిర్వహణ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను ప్రారంభించడానికి సిద్ధులగుట్టపైకి వచ్చిన జీవన్‌ రెడ్డికి శివాలయం అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.

ఈ సమయంలో భక్తుల శివనామ స్మరణతో సిద్ధులగుట్ట మారుమోగింది. అభివృద్ధి ప్రధాత జీవనన్న వర్ధిల్లాలి, ఓం నమః శివాయ, శంభో శంకర హరహర మహాదేవ్‌ నినాదాల మధ్య జీవన్‌ రెడ్డి ఘాట్‌ రోడ్డు పొడవునా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత అయిదున్నర సంవత్సరాలుగా అభివృద్ధి పధంలో పురోగమిస్తున్న సిద్ధులగుట్ట నేడు ఆధ్యాత్మిక కేంద్రంగా అంగరంగ వైభవంతో విరాజిల్లుతోందన్నారు.

సెంట్రల్‌ లైటింగ్‌ తో కొత్తకాంతులు విరాజిమ్ముతున్న ఈ సిద్ధులగుట్టపై నిర్మాణాలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం జ్ఞాన మందిర నిర్మాణం జరుగుతోందని, ఆర్మూర్‌ ఎస్‌ ఎస్‌ కే సమాజ్‌ ఆధ్వర్యంలో సహసార్జున స్వామి ఆలయ నిర్మాణం చేపట్టి త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, ఆ మహా శంకరుడే తాను ప్రత్యక్షంగా నెరిసిన సిద్ధులగుట్టను అభివృద్ధి చేసుకుంటూ భక్తజన కోటిని అలరిస్తున్నారని ఆయన అన్నారు.

సిద్ధులగుట్ట చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతుందని జీవన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా సిద్ధులగుట్టపై నిర్మించతలపెట్టిన సహస్రర్జున మందిర నిర్మాణ పనులను జీవన్‌ రెడ్డి పరిశీలించి ఆలయ కమిటీ, ఎస్‌ఎస్‌కే సమాజ్‌ కమిటీ సభ్యులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »