రెంజల్, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు గురువారం జిల్లా బాలికల సంరక్షణ అధికారి వనిత తనిఖీ చేశారు. ఆదర్శ పాఠశాలలోని నిత్యవసరల సరుకులను పాఠశాల చుట్టూ పరిశుభ్రతను తీరును పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలసారం పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. విద్యార్థుల స్థితిగతులు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ కుమార్, ప్రిన్సిపాల్ బలరాం, మండల వైద్య విస్తీర్ణ అధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, ఉపాధ్యాయులు తదితరులున్నారు.