రెంజల్, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై ఎస్సై సాయన్న గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ కేసులలో మోసపోకుండా ఉండాలని ఎవరైనా అరిచిత వ్యక్తులు లోన్‌ల పేరిట ఫెక్ కాల్ చేసి లోన్‌లు ఇప్పిస్తామని చెపితే నమ్మవద్దని ఫోన్ నంబర్లు, ఓటిపిలు, ఈ మెయిల్ ఐడిలు ఎవరికి షేర్ చేయవద్దని సూచించారు.
ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే పోలీసులను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాద్యాయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.