కామారెడ్డి, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ 20 లోపు పాఠశాలలో పనులను పూర్తి చేయాలని సూచించారు. మరమత్తు పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. పనులను నాణ్యతతో చేపట్టాలని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గంగా కిషన్, మండల విద్యాధికారి ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అధికారులు పాల్గొన్నారు.