రెంజల్, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ్ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనాన్ని జడ్పీటీసీ మేక విజయ సంతోష్ పరిశీలించారు.
విద్యార్థులకు అందజేసే భోజనంతీరును పరిశీలించి స్వయంగా భోజనాన్ని విద్యార్థులకు అందించారు. నాణ్యమైన పదార్థాలను మెనూ ప్రకారం అందజేయాలని ఏజెన్సీ నిర్వహుకుల సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బలరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.