నసురుల్లాబాద్, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ విఠల్ ఆధ్వర్యంలో మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలు చదివి వినిపించారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు, సమయానికి అందుబాటులో ఉండాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.
పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ గత వర్షానికి కొట్టుకపోవడంతో ఇంకా దాని మరమ్మత్తు పనులు చేయలేదని నసురుల్లాబాద్ సర్పంచ్ అరిగే సాయిలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కొరకు కెవైసి కానీ రైతులకు అవగాహన కల్పించి కేవైసీ చేయించాలని సంబంధిత అధికారులకు సర్పంచులు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, మండల కోఆప్షన్ మెంబర్ ముస్తఫా వాజిత్ హుస్సేన్, ఎంపీఓ రాము, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.