లింగంపేట్, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండలంలోని పోల్కంపేట తండా రోడ్డుకు ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ నిధులతో శుక్రవారం నేతలు, రోడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పోల్కంపేట తండాను పట్టించుకున్న నాథుడేలేడన్నారు. ప్రస్తుత శాసనసభ్యులు సురేందర్‌కి తండా రోడ్డు సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ సందర్భంగా తండావాసులు ఎన్నో సంవత్సరాల కలను నెరవేర్చిన ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి మండలాధ్యక్షుడు దివిటి రమేష్, ఉప సర్పంచ్ రామానుజ చారి, సీనియర్ నాయకులు మణిగిరి నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు చాకలి రమేష్, రవీందర్ గౌడ్, గ్రామ కార్యదర్శి మహమ్మద్ అశ్వఖ్, నాయకులు తలారి యాదగిరి, గిరిజన నేతలు రౌసింగ్, పీర్యా, విట్ఠల్, శంకర్, నర్సింగ్, బద్దు, శీను, దేవ్, కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.